మహేష్ ఛాన్స్ తో స్టార్ అయ్యింది..!

April 21, 2017


img

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగదాస్ స్పైడర్ మూవీ చేస్తుండగా ఆ సినిమా తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది. భరత్ అనే నేను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా మూవీలో బాలీవుడ్ బికిని బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఎం.ఎస్ ధోనిలో నటించి మెప్పించిన కియారా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. కాని మహేష్ హీరోయిన్ అనేసరికి గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు.

ఈమధ్యలో గూగుల్ సెర్చింగ్ లో ట్రెండింగ్ లో ఉంది కియారా అద్వాని. ఇదంతా మహేష్ సినిమా ప్రభావమే అని చెప్పాలి. మహేష్ లాంటి సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ ఎవరో అని తెలుసుకునే క్రమంలో అభిమానులు గూగుల్ లో ఆమెను ఓ రేంజ్ లో వెతికారు. అందుకే ఇప్పుడు కియారా స్టార్ స్టేటస్ దక్కించుకుంది. మహేష్ సినిమాలో అలా సెలెక్ట్ అయ్యిందో లేదో మిగతా హీరోలు కూడా ఆమె గురించి ఆరా తీయడం మొదలు పెట్టారట. హీరోయిన్ కొరత ఉండే టాలీవుడ్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు కచ్చితంగా క్లిక్ అవుతుందని అనిపిస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష