మళ్లీ ప్రభాస్ తోనే రాజమౌళి..?

April 19, 2017


img

బాహుబలి మొదటి రెండు పార్టుల కోసం దాదాపు కెరియర్ లో ఐదు సంవత్సరాలు రాసిచ్చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంతకంత క్రేజ్ పెంచేసుకున్నాడు. ఈ క్రమంలో రాజమౌళితో సినిమా అంటే ఇంత టైం కేటాయించాలా అని స్టార్స్ ఆలోచనలో పడ్డారు. కాని వారందరికి షాక్ ఇస్తూ మళ్లీ తన తర్వాత సినిమా కూడా రాజమౌళి డైరక్షన్ లో చేసే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్.

బాహుబలి-2 తర్వాత ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి చర్చలు మొదలు పెట్టాడు. అయితే ఈ లోగా బాహుబలి తో హిందిలో పెద్ద మొత్తంగా లాభాలు ఘడించిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరోసారి ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమాను సెట్ చేస్తున్నాడట. ఆ సినిమాతో ప్రభాస్ ను డైరెక్ట్ గా హింది మార్కెట్ కు పరిచయం చేయాలని అనుకుంటున్నాడట. 

రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ గా ఆ సినిమా ఉండేలా జక్కన్నకు సలహా ఇచ్చాడట కరణ్ జోహార్. బాహుబలి లాంటి భారీ సినిమా తీశాక తన ప్లాన్ ప్రకారం ఓ చిన్న బడ్జెట్ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్న రాజమౌళికి కరణ్ జోహార్ ఇచ్చిన ఆఫర్ నచ్చేయడంతో కాదనలేకపోతున్నాడట. రాజమౌళి, ప్రభాస్ , కరణ్ జోహార్ ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ నిజంగా సెట్ అయితే మాత్రం మరో సంచలనమే అని చెప్పాలి. మరి ఈ మూవీపై మరిన్ని డీటేల్స్ త్వరలో బయటపెడతారేమో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష