RRR రిలీజ్ డేట్ ఫిక్స్..!

January 25, 2021

img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమాగా RRR సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తున్నారు. హాలీవుడ్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ కూడా నటిస్తున్నారు.

సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పాత్రలని పరిచయం చేస్తూ వచ్చిన టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక లేటెస్ట్ గా సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేస్తూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. 2020 జూలై రిలీజ్ అనుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆ తర్వాత 2021 జనవరి 8న రిలీజ్ అని చెప్పారు. కాని కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా అక్టోబర్ 13 ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

దసరా సందర్భంగా లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుని ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ వచ్చిన పోస్టర్ లో గుర్రం మీద చరణ్, బుల్లెట్ మీద తారక్ అదిరిపోయే లుక్ తో కనిపించారు. చాలా రోజులుగా ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున ఫ్యాన్స్ కు ఈ అప్డెట్ ఫుల్ జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Fire 🔥 and Water 🌊 will come together to make an unstoppable FORCE as you've never witnessed!

Get Ready to experience Indian Cinema in its finest avatar on October 13, 2021 👊🏼#RRRFestivalOnOct13th #RRR #RRRMovie pic.twitter.com/7vSMf0bI5n
— Ram Charan (@AlwaysRamCharan) January 25, 2021

Related Post

సినిమా స‌మీక్ష