'సలార్' విలన్ రేసులో అతను కూడా..!

January 23, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాలో విలన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. బాహుబలి ప్రభాస్, కె.జి.ఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ఈ సినిమాలో విలన్ గా నిన్నటి వరకు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటిస్తాడని అన్నారు.

లేటెస్ట్ గా సలార్ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టే పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తాడని టాక్. తమిళంలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న విజయ్ సేతుపతి తనని మెప్పించే ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీ అంటున్నాడు. రీసెంట్ గా దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కూడా విజయ్ సేతుపతి విలన్ గా చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ లో కూడా చాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. రాధే శ్యాం తర్వాత ప్రభాస్ సలార్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు.  ఈ సినిమాతో పాటుగా ఆదిపురుష్ కూడా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష