మహేష్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే..!

January 21, 2021


img

సూపర్ స్టార్ మహేష్ ఫిట్ నెస్ సీక్రెట్ తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ఎప్పుడో పోకిరి సినిమా టైం లో 15, 16 ఏళ్ల క్రితం మహేష్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఛార్మింగ్ లుక్ తో ఉన్నాడు. వయసు పెరుగుతున్నా గాని ఆ తేడా మాత్రం అసలు తెలియనివ్వడం లేదు. టాలీవుడ్ అందగాడు మహేష్ తన ఫిట్ నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తాడు. ఈమధ్య మహేష్ తన జిమ్ వర్క్ అవుట్ వీడియోస్ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  

లేటెస్ట్ గా మహేష్ బాక్స్ జంపింగ్ ను చేస్తూ ఉన్న వీడియో ఇన్ స్టాగ్రాం లో షేర్ చేశారు.  ఆటను రైజ్ చేయండి.. ఇంకా పైకి లేవండి.. హద్దులు లేవని గుర్తించండి. . ఎవ్వరూ ఆపరేనంతగా దూసుకువెళ్లండి అంటూ ఫ్యాన్స్ కు ఓ మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  





Related Post

సినిమా స‌మీక్ష