ఆ హీరోయిన్ ను వద్దనేసిన గోపీచంద్..!

January 20, 2021


img

యాక్షన్ హీరో గోపీచంద్ తెలుగులో సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగిన ఫలితాలను అందుకోవట్లేదు. ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్న గోపీచంద్ ఈ సినిమా తర్వాత మారుతి డైరక్షన్ లో గోపీచంద్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఈమధ్యనే వచ్చింది. మారుతి డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఫైనల్ డెశిషన్ కు రాలేదని తెలుస్తుంది.

మారుతి ప్రతిరోజూ పండుగతో హిట్ అందుకున్నాడు కాబట్టి రాశి ఖన్నానే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకున్నాడట కాని గోపీచంద్ మాత్రం ఆమెని వద్దని చెప్పినట్టు తెలుస్తుంది. జిల్, ఆక్సిజన్ సినిమాల్లో గోపీచంద్ తో రాశి ఖన్నా జోడీ కట్టింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఆ బ్యాడ్ సెంటిమెంట్ తోనే రాశి ఖన్నా అంటే వద్దని చెప్పాడట గోపీచంద్. అందుకే మారుతి గోపీచంద్ కు జోడీగా కొత్త హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష