K.G.F-2 60 కోట్ల బిజినెస్..?

January 20, 2021


img

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వస్తున్న సినిమా కె.జి.ఎఫ్ 2. పార్ట్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమా పక్కా హిట్ అనిపించేలా చేసింది. అందుకే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 బిజినెస్ అదిరిపోయేలా జరుగుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాను 60 కోట్ల భారీ డీల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

కె.జి.ఎఫ్ చాప్టర్ 1 కేవ్లం ఐదు కోట్లతో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ 1 సెన్సేషనల్ హిట్టయ్యి 12 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2ని భారీ రేంజ్ లో అమ్మేసినట్టు తెలుస్తుంది. గుంటూరు ఏరియాలోనే ఈ సినిమాను ఐదు కోట్లు పెట్టి తీసుకున్నట్టు టాక్. మొత్తానికి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సూపర్ హిట్ అనిపించుకోవాలంటే తెలుగులోనే 80 నుండి 100 కోట్ల వసూళ్లను రాబట్టాలి.



Related Post

సినిమా స‌మీక్ష