అల్లు అర్జున్ నోట.. పవన్, ఎన్టీఆర్, చరణ్ మాట..!

January 12, 2021


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా అల వైకుంఠపురములో. నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన్ బన్నీ స్టామినా ఏంటో చూపించిన సినిమా ఇది. త్రివిక్రం మార్క్ సినిమాగా అల్లు అర్జున్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కేలా చేసిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రిలీజై వన్ ఇయర్ అయిన సందర్భంగా అల వైకుంఠపురములో యూనిట్ రీయూనియన్ బాష్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో అల వైకుంఠపురములో టీం పాల్గొన్నారు. 

ఈవెంట్ లో భంగా 2020 వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా చేసింది. అందరికి ఎలా ఉన్నా 2020 నాకు మాత్రం హ్యాపీనెస్ ఇచ్చింది. అది కూడా అల వైకుంఠపురములో సినిమాతో వచ్చింది అన్నారు అల్లు అర్జున్. ప్రతి హీరోకి మైల్ స్టోన్ మూవీస్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఖుషి అప్పటి ఆల్ టైం రికార్డ్, ఎన్టీఆర్ కు సింహాద్రి, రాం చరణ్ కు మగధీర. అయితే అందరికి ఎర్లీ స్టేజెస్ లోనే ఆల్ టైం రికార్డులు వచ్చాయి. తనకు మాత్రం 20వ సినిమాకు అది సాధ్యమైందని.. ఇక నుండి ఎమి చెప్పను యాక్షన్ లోనే చూపిస్తానని కాన్ ఫిడెంట్ గా చెప్పారు అల్లు అర్జున్. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోష్ స్పష్టంగా అల్లు అర్జున్ లో కనిపిస్తుంది. అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష