రామ్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ఢీ..!

January 12, 2021


img

సంక్రాంతి వచ్చిందంటేనే సినిమాల పండుగ మొదలైనట్టే. ఈ సంక్రాంతికి కూడా సినిమాల సందడి మొదలైంది. ఆల్రెడీ రెండు రోజుల క్రితం రవితేజ క్రాక్ తో సూపర్ ఓపెనింగ్ ఇచ్చాడు. ఇక జనవరి 13 బుధవారం విజయ్ మాస్టర్ తో వస్తున్నాడు. 14న రామ్ రెడ్ తో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ కూడా రిలీజ్ అవుతుంది. అసలైతే బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ జనవరి 15న రిలీజ్ అనుకున్నారు. రెడ్ 14న వస్తే.. అల్లుడు అదుర్స్ 15న వస్తే బాగుండేది. కాని సడెన్ గా రెండు రోజుల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా రిలీజ్ డేట్ ముందుకొచ్చింది. 

అల్లుడు అదుర్స్, రెడ్ సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ లో ఒకేసారి వస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే రెండు సినిమాలను నైజాం రిలీజ్ చేస్తున్న దిల్ రాజు రెడ్, అల్లుడు అదుర్స్ నిర్మాతలను కన్విన్స్ చేయాలని చూశారట. చర్చలు విఫలమవడంతో చేసేది లేక సైలెంట్ అయ్యారట. ఆల్రెడీ రిలీజైన క్రాక్ సేఫ్ జోన్ లో ఉండగా విజయ్ మాస్టర్ సినిమా హిట్టైతే ఈ రెండు సినిమాల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. రామ్ రెడ్ ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా రీమేక్ కాబట్టి సినిమాపై ఫుల్ కాన్ ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రెండిటిలో ఏ సినిమాది పైచేయి అవుతుందో రెండు రోజుల్లో తెలుస్తుంది.     Related Post

సినిమా స‌మీక్ష