అక్కడ ఉంది క్రిష్.. PSPK27 అనుకున్న టైంకు కావాల్సిందే..!

January 12, 2021


img

అటు సినిమాలు.. ఇటు పాలిటిక్స్ రెండిటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ వకీల్ సాబ్ తో తిరిగి సినిమాలను షురూ చేశారు. పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ డైరక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పవన్ కెరియర్ లో ఇంతవరకు ఎప్పుడూ చేయని పిరియాడికల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

PSPK27 ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ కూడా రీసెంట్ గా మొదలైనట్టు తెలుస్తుంది. సోమవారం నుండి సినిమాకు సంబందించిన సెకండ్ షెడ్యూల్ మొదలైందని సమాచారం. ఎక్కువ రోజులు షూటింగ్ జరుగనున్న ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబందించిన ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. సినిమాలో పవర్ స్టార్ కొత్తగా కనిపిస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో పూర్తిగా కొత్తగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. వకీల్ సాబ్ పూర్తి చేశాక ఏమాత్రం రెస్ట్ లేకుండా క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్. క్రిష్ సినిమా అంటే అంతే.. అనుకున్న టైం కు పూర్తి చేయాల్సిందే. పవన్ తో సినిమా సెట్స్ మీద ఉండగానే వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా పూర్తి చేసి పక్కన పెట్టాడు క్రిష్. Related Post

సినిమా స‌మీక్ష