విజయ్ 'మాస్టర్' ఆన్ లైన్ లీక్..!

January 12, 2021


img

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా జనవరి 13న రిలీజ్ అవనుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసారు. తమిళ వర్షన్ 200 కోట్ల దాకా బిజినెస్ చేయగా తెలుగులో మాత్రం విజయ్ మాస్టర్ సినిమాను 9 కోట్లకు కొన్నట్టు తెలుస్తుంది. బుధవారం రిలీజ్ అవబోతున్న మాస్టర్ సినిమాకు సంబందించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వాట్సాప్ స్టేటస్ లో విజయ్ మాస్టర్ సీన్స్ దర్శనమిచ్చాయి. 

రిలీజ్ అవకుండానే సినిమా ఆన్ లైన్ లో లీక్ అయినట్టు కనిపెట్టారు దర్శక నిర్మాతలు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ లీకులకు కారణం ఎస్.డి.ఎస్ సినిమాస్ కు చెందిన ఓ ఉద్యోగి అని తెలిసింది. థియేటర్ కు వచ్చిన ప్రింట్ కు పైరసీ చేసి ఆన్ లైన్ లో లీక్ చేసినట్టు తెలుస్తుంది. మాస్టర్ సినిమా లీక్స్ విషయంపై డైరక్టర్ లోకేష్ కనగరాజ్ బాగా అప్సెట్ అయ్యారు. అందరు థియేటర్ లోనే సినిమా చూడాలని కోరారు. లీక్స్ కు కారణమైన వ్యక్తిపై లీగల్ యాక్షన్ తీసుకుంటారని సమాచారం.  Related Post

సినిమా స‌మీక్ష