వరుణ్ తేజ్ తో పవన్ కళ్యాణ్..!

January 12, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత ప్రొడక్షన్ లో కొత్త సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో కిశోర్ కుమార్ అలియాస్ డాలీ డైరక్షన్ లో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తాడని టాక్. పవన్ తో గోపాలా గోపాల, కాటరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన డాలీ ఇప్పుడు వరుణ్ తేజ్ తో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

టాలీవుడ్ లో ఉన్న రీమేక్ స్పెషలిస్ట్ లో కిశోర్ కుమార్ (డాలీ) ఒకరు. అంతకుముందు అతను చేసిన కొంచం ఇష్టం కొంచం కష్టం, తఢాకా కూడా రీమేక్ సినిమాలే అవడం విశేషం. ఇక వరుణ్ తేజ్ తో చేసిన సినిమా కూడా ఏదైనా రీమేక్ అయ్యుంటుందా అని డౌట్ పడుతున్నారు. సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తే కాని తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. పవర్ స్టార్ ప్రొడ్యూసర్ గా మెగా ప్రిన్స్ హీరోగా వస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎలాగు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా కెమియో రోల్ చేస్తే సినిమా వేరే లెవల్ కు వెళ్లినట్టే.Related Post

సినిమా స‌మీక్ష