పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే తో..!

January 11, 2021


img

మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవరగ నాగ వంశీ నిర్మిస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాతో పాటుగా ఈ రీమేక్ ను కూడా ఒకేసారి షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రం డైలాగ్స్ రాస్తున్నాడని తెలుస్తుంది. ఇందుకు త్రివిక్రం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అయితే ఈ రీమేక్ కోసం పవన్ మరోసారి తన క్రియేటివిటీ చూపించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమాలో నటించడమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారట స్క్రీన్ ప్లే. స్క్రిప్ట్ దశ నుండే ఈ సినిమాపై పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ స్క్రీన్ ప్లే తో వస్తున్న ఏకే రీమేక్ తప్పకుండా మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా దగ్గుబాటి ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష