మహేష్ తో వెంకీ కుడుముల.. కొరటాల హెల్పింగ్ హ్యాండ్..!

January 11, 2021


img

సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ తో కీర్తి సురేష్ రొమాన్స్ చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని మహేష్, రాజమౌళి కాంబో సినిమా ఫిక్స్ అయినట్టే అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రాజమౌళి ఎలా లేదన్నా ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాడు. ఈలోగా మహేష్ రెండు సినిమాలు చేయాలని చూస్తున్నాడు.

ఆల్రెడీ సర్కారు వారి పాట అప్పటికి రిలీజ్ అవుతుంది. ఇక రాజమౌళి సినిమా చేసేలోగా మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కథల వేటలో పడినట్టు తెలుస్తుంది. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల  మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. కొరటాల శివకు వెంకీ కథ చెప్పడం ఆయన సూపర్ అనేయడం జరిగిందట. కొరటాల శివ సహకారంతోనే మహేష్ తో వెంకీ సినిమా చేస్తాడని తెలుస్తుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలు మహేష్ కు ఇచ్చిన కొరటాల శివ చెప్పాడంటే అందులో తిరుగులేదని మహేష్ కూడా ఫిక్స్ అయ్యాడు. వెంకీతో మహేష్ సినిమా.. అదే జరిగితె మాత్రం వెంకీ కుడుముల కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే.Related Post

సినిమా స‌మీక్ష