చరణ్ కు నెగటివ్ వచ్చేసిందా..!

January 11, 2021


img

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని డిసెంబర్ 29న ట్విట్టర్ లో షేర్ చేశారు రామ్ చరణ్. తనని కలిసిన వారంతా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఆ మరుసటి రోజే వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మెగా బ్రదర్స్ ఇద్దరు హోమ్ క్వారెంటైన్ లో ఉండగా రీసెంట్ గా వరుణ్ తేజ్ తనకు కరోనా నెగటివ్ వచ్చిందని ట్విట్టర్ లో షేర్ చేశాడు. అయితే రాం చరణ్ నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.

చరణ్ కూడా హోమ్ క్వారెంటైన్ లో ఉండటం వల్ల కరోనా నుండి కోలుకున్నారట. ఈమధ్యనే చరణ్ రెండు సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. అందుకు గల కారణాలు ఏంటన్నది తెలియదు కాని చరణ్ కూడా కోవిడ్ నుండి బయటపడ్డాడని తెలుస్తుంది. త్వరలోనే రాం చరణ్ మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష