ఆచార్య ఆ డేట్ లాక్ చేశాడా..?

January 09, 2021


img

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ మూవీస్ ఎంటర్టైన్ మెంట్స్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. చరణ్ తో అరగంట ఎపిసోడ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఆచార్య సినిమాను మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మే 9 అనగానే చిరంజీవి సూపర్ హిట్ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి గుర్తుకు రాక మానదు. ఇప్పుడు ఆ సూపర్ హిట్ సినిమా సెంటిమెంట్ తోనే మెగాస్టార్ ఆచార్య సినిమాను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆచార్య టీజర్ సంక్రాంతికి వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దానికి సంబందించిన అప్డేట్ మాత్రం రాలేదు.Related Post

సినిమా స‌మీక్ష