'టక్ జగదీష్' రిలీజ్ ఎప్పుడంటే..!

January 09, 2021


img

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా రాబోతుంది టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. జనవరి 10న టీజర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్.

సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఉగాది ఏప్రిల్ 13న ఉండగా ఉగాది సందర్భంగా టక్ జగదీష్ ను ఏప్రిల్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. వి సినిమాతో టార్గెట్ మిస్సైన నాని టక్ జగదీష్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణతో నిన్ను కోరి సినిమాతో హిట్ అందుకున్న నాని టక్ జగదీష్ తో కూడా హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష