'క్రాక్' రిలీజ్ కు బ్రేక్..!

January 09, 2021


img

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జనవరి 9 శనివారం అనగా ఈరోజు రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల రవితేజ క్రాక్ రిలీజ్ కు బ్రేక్ పడ్డదని తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ అవకుండా ఉండటానికి కారణం నిర్మాత ఠాగూర్ మధునే కారణమని తెలుస్తుంది. విశాల్ హీరోగా తమిళంలో వచ్చిన అయోగ్య సినిమా గురించి ఆర్ధిక లావాదేవీల మీద కోర్టులో కేసు నడుస్తుంది. ఈ గొడవలో క్రాక్ నిర్మాత ఠాగూర్ మధుకి లింక్ ఉందని తెలియడంతో క్రాక్ సినిమా రిలీజ్ ను అడ్డుకున్నారు. ఠాగూర్ మధు నిన్న సాయంత్రం నుండి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నా అవి సఫలం కాలేదని తెలుస్తుంది. మోర్నింగ్, ఆఫ్టర్ నూన్ షోలు ఆపేసి ఫస్ట్ షో నుండి సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ కు బ్రేక్ పడేలా ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష