వింక్ బ్యూటీ 'ఇష్క్'

January 09, 2021


img

ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో కన్నుగీటి కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టిన బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. అప్పట్లో తెలుగులో ఛాన్సులు వచ్చినా చేస్తే గీస్తే స్టార్ సినిమాల్లోనే చేస్తానని చెప్పిన అమ్మడు ఇప్పుడు యువ హీరోల సినిమాలకు సైన్ చేస్తుంది. ఆల్రెడీ నితిన్ చెక్ సినిమాలో నటిస్తున్న ప్రియా ప్రకాశ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటి ఈమధ్యనే లీడ్ రోల్స్ చేస్తున్న తేజా సజ్జా సినిమాలో ఆమె ఛాన్స్ అందుకుంది.


మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేసిన ఇష్క్ సినిమాలో తేజా సజ్జా, ప్రియా ప్రకాశ్ జోడీ కడుతున్నారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ నితిన్, విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇష్క్. ఈ సినిమా టైటిల్ తోనే తేజా సజ్జా సినిమా వస్తుంది. ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. మరి ఇష్క్ అని చెప్పి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సినిమా అంటే ఒకప్పుడు హిట్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది మరి ఆ ప్రొడక్షన్ హౌజ్ కు ఇది మంచి కం బ్యాక్ సినిమా అవుతుందో లేదో చూడాలి



Related Post

సినిమా స‌మీక్ష