సంక్రాంతికి 50 పర్సెంట్ ఆక్యుపెన్సీనే..!

January 09, 2021


img

తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత థియేటర్లు తెరచుకున్నాయి. కరోనా ఇంకా ప్రభావితం చూపిస్తున్న కారణంగా థియేటర్లలో ప్రస్తుతానికి 50 పర్సెంట్ ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. డిసెంబర్ ఎండింగ్ లో రిలీజైన సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక సంక్రాంతి సినిమాల హంగామా మొదలైంది. తమిళనాడులో థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాక్ ఇవ్వడంతో 50 శాతం ఆక్యుపెన్సీకే ఫిక్స్ అయ్యారు.

కోలీవుడ్ లో సంక్రాంతికి విజయ్ మాస్టర్ సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ దాదాపు అన్ని థియేటర్లలో మాస్టర్ మాత్రమే ఆడబోతుందని చెప్పొచ్చు. అయితే తెలుగులో మాత్రం మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రవితేజ క్రాక్, రామ్ రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు రిలీజ్ అవుతుండగా విజయ్ మాస్టర్ కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ సినిమాలు ఆడనున్నాయి. మరి సంక్రాంతి సినిమాల హంగామా వసఊలొల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష