నాగ చైతన్యలో ఈ టాలెంట్ కూడానా..?

January 09, 2021


img

అక్కినేని హీరోల్లో ప్రస్తుతం సూపర్ జోష్ లో ఉన్నాడు నాగ చైతన్య. మజిలీ, వెంకీమామ  సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టగా శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో హ్యాట్రిక్ పై గురి పెట్టాడు నాగ చైతన్య. సినిమా టైటిలే లవ్ స్టోరీ అని పెట్టారంటే మాత్రం శేఖర్ కమ్ముల ఈ సినిమాను చాలా స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ జనవరి 10న రిలీజ్ కాబోతుంది.

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు. విక్రం కె కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది. రీసెంట్ గా సమంత హోస్ట్ గా చేస్తున్న సామ్ జామ్ షోలో పాల్గొన్న నాగ చైతన్య తన గురించి ఎవరికి తెలియని సీక్రెట్ బయట పెట్టాడు. నాగ చైతన్య కీబోర్డ్ ను బాగా ప్లే చేస్తారట. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో తాను 4 ఏళ్ల పాటు సంగీతం నేర్చుకున్నానని టాప్ సీక్రెట్ రివీల్ చేశారు నాగ చైతన్య. తనకు కీ బోర్డ్ ప్లే చేయడం వచ్చని చెప్పారు. ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు దాచాడో కాని సమంత షోలో మ్యూజిక్ పై తన ఇంట్రెస్ట్ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చారు నాగ చైతన్య.



Related Post

సినిమా స‌మీక్ష