ఆదిపురుష్ సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడంటే..!

January 08, 2021


img

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా రావణుడి పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నాడు. భారీ వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ తో వస్తున్న ఈ సినిమాను ఈ నెల 19 నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ లైన్ లో ఉంది. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా కూడా ప్లాన్ చేశాడు ప్రభాస్. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ తో మరోసారి ప్రశాంత్ నీల్ తన సత్తా ఏంటో చూపించాడు. కె.జి.ఎఫ్ సినిమాకు ఉన్న అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నారు. ఇక సలార్ సినిమాను కూడా అంచనాలకు తగినట్టుగానే చేస్తాడని తెలుస్తుంది,



Related Post

సినిమా స‌మీక్ష