K.G.F చాప్టర్ 2 టీజర్.. అంచనాలకు మించి..!

January 08, 2021


img

కన్నడ పరిశ్రమ స్థాయిని పెంచిన సినిమాగా కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండానే సౌత్ అన్ని భాషల్లో రిలీజైన కె.జి.ఎఫ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆ సినిమా పార్ట్ 2 సెట్స్ మీద ఉంది. ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. డైరక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద పెరిగిన అంచనాలకు తగినట్టుగానే అవుట్ పుట్ వచ్చేలా చేస్తున్నారని తెలుస్తుంది.

గురువారం రాత్రి యూట్యూబ్ లో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ ప్రత్యక్షమైంది. అసలైతే జనవరి 8 యశ్ బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కె.జి.ఎఫ్ 2 టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు. కాని ఈ లోగానే ఎవరో ఈ టీజర్ లీక్ చేయడం జరిగింది. ఇక చేసేదేమి లేక కె.జి.ఎఫ్ నిర్మాతలు కూడా అఫీషియల్ గా టీజర్ రిలీజ్ చేశారు.  

ఇక టీజర్ విషయానికి వస్తే కె.జి.ఎఫ్ ఎక్కడ ఆగిందో అక్కడ నుండే పార్ట్ 2 మొదలవుతుంది. సీక్వల్ ను ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఉండాలని కోరుతున్నారో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా వస్తుందని శాంపిల్ గా టీజర్ తోనే చెప్పాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్. ముఖ్యంగా హీరోయిజం చూపించే సీన్స్ దానితోడూ మదర్ సెంటిమెంట్.. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం అనేలా ఉంది. చాప్టర్ 2లో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్స్ కూడా నటించి సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేశారు. 



 


Related Post

సినిమా స‌మీక్ష