లవ్ స్టోరీ టీజర్ వచ్చేస్తుంది..!

January 07, 2021


img

మజిలీ, వెంకీమామ సినిమాలతో సూపర్ ఫాం లోకి వచ్చిన నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కె.కె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ ప్లాన్ చేశారు. 

సినిమా టైటిల్ నే లవ్ స్టోరీ అని పెట్టిన శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కావ్యాన్ని ఎలా తెరకెక్కించాడో చూడాలని యువత ఉత్సాహంగా ఉన్నారు. ఫిదా సినిమాతో శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబో సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న లవ్ స్టోరీపై అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ రాలేదు కాని సినిమా టీజర్ తో డైరక్టర్ శేఖర్ కమ్ముల సినిమాపై సూపర్ క్రేజ్ వచ్చేలా చేస్తారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష