భీష్మ డైరక్టర్ స్టార్ హీరో ఛాన్స్..!

December 04, 2020


img

ఛలో సినిమాతో సూపర్ ఎంటర్టైన్ చేసి భీష్మ సినిమాటో మరో హిట్ అందుకుని సత్తా చాటాడు డైరక్టర్ వెంకీ కుడుముల. చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు వెంకీ కుడుముల. ఇక తన నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడు వెంకీ. ఛలో, భీష్మ రెండు సూపర్ ఎంటర్టైన్ అందించాయి. 

సినిమా కథలు రొటీన్ గా ఉన్నా హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అందుకే రెండు సినిమాలతోనే వెంకీ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే భీష్మ హిట్ తర్వాత రాం చరణ్ తో సినిమా కోసం ట్రయల్స్ వేసిన వెంకీ చరణ్ నో అన్నాడో ఏమో కాని మహేష్ కోసం కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది. రీసెంట్ గా మహేష్ ను కలిసి కథ చెప్పాడట వెంకీ కుడుముల. మహేష్ పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు టాక్. ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమాకు ఉన్న గ్యాప్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ లక్ బాగుంటే అది వెంకీ కుడుములతోనే ఉంటుందని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష