'టక్ జగదీష్' ఎక్కడ ఉన్నాడు..?

December 04, 2020


img

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన ఇద్దరు భామలు ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన చివరి షెడ్యూల్ రీసెంట్ గా స్టార్ట్ అయిందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుందని టాక్.

నాని 25వ సినిమా వి నిరాశపరచగా 26వ సినిమాగా వస్తున్న టక్ జగదీష్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాని. నాని శివ నిర్వాణ కలిసి చేసిన నిన్ను కోరి సూపర్ హిట్ అయ్యింది. అదే మ్యాజిక్ ఈ సినిమాతో రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో నానికి ఈక్వల్ రోల్ లో జగపతి బాబు నటిస్తున్నారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష