సలార్ అంటే అర్ధం అదే.. ప్రభాస్ అందుకు పర్ఫెక్ట్..!

December 04, 2020


img

కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా ఎనౌన్స్ చేశాడు. కె.జి.ఎఫ్ తో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. సలార్ అంటూ బిగ్ ఎనౌన్స్ మెంట్ తో బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ టైటిల్ కు అర్ధం ఏంటని తెగ వెతికేశారు. కొందరు ఏకంగా డైరక్టర్ ప్రశాంత్ నీల్ నే ఎటాక్ చేశాడు. ఇలా అర్ధం తెలియని టైటిల్ పెట్టావ్.. ఇంతకీ దాని అర్ధం ఏంటని డైరక్టర్ ను ఎటాక్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.

వారి దాటిని తట్టుకోలేక ప్రశాంత్ నీల్ సలార్ అర్ధం ఏంటో చెప్పాడు. సలార్ అనేది ఉర్దూ పదమని.. సలార్ అంటే సమర్ధవంతమైన నాయకుడని అన్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నే ఎందుకు సెలెక్ట్ చేశారన్న విషయాన్ని చెబుతూ అమాయకుడైన వ్యక్తి కరుడు కట్టిన నాయకుడిగా ఎలా మారాడన్నదే కథ. ప్రభాస్ అమాయక్త్వాన్ని.. రౌద్రాన్ని అద్భుతంగా పండించగలడు.. అందుకే అందుకే అతన్ని సెలెక్ట్ చేశానని అన్నాడు ప్రశాంత్ నీల్.  



Related Post

సినిమా స‌మీక్ష