మహేష్ సినిమాలో పవన్..?

December 03, 2020


img

సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే. మల్టీస్టారర్ కూడా కాదు ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్ చేసినా ఫ్యాన్స్ కు పండుగే. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం పరశురాం ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో ప్రశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో పవన్ కనిపిస్తాడని టాక్.

పవర్ స్టార్ ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత వరుసగా ఐదారు సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. అయితే ఇవి కాకుండా మహేష్ సినిమాలో గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ ఉంటుందా అని డౌట్ పడుతున్నారు. అయితే మహేష్, పవన్ కలిసి సినిమా చేస్తే మాత్రం ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం. పవర్ స్టార్ జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మరి మహేష్ సినిమాకు పవన్ సపోర్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 2021 జనవరిలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష