పూజా డిమాండ్ అలా ఉంది..!

December 03, 2020


img

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సూపర్ ఫాంలో ఉంది. ఈ ఇయర్ ఆల్రెడీ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూజా హెగ్దే ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న పూజా హెగ్దే తన నెక్స్ట్ సినిమా దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న మూవీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను హను రాఘవపుడి డైరెక్ట్ చేస్తున్నారు.

పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో నటించేందుకు గాను పూజా హెగ్దే భారీ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. మొన్నటివరకు సినిమాకు కోటి, కోటిన్నర తీసుకున్న పూజా హెగ్దే ఈ సినిమాకు రెండున్నర కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి పూజా, రష్మిక ఇద్దరు ఉంటే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష