అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఫస్ట్ లుక్ పోస్టర్..!

November 27, 2020


img

ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా సత్తా చాటుతూ మరోపక్క సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతుంది. జబర్దస్త్ యానక్ర్ గా గ్లామర్ షోతో ఆడియెన్స్ ను అలరిస్తున్న అనసూయ సినిమాల్లో మాత్రం మంచి పాత్రలు చేస్తూ వస్తుంది. క్షణం నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన కథనం వరకు అనసూయ సినిమా చేస్తే స్పెషల్ గా ఉంటుందని చెప్పుకునేలా చేసింది. 

ఇక లేటెస్ట్ గా అనసూయ థ్యాంక్ యు బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ రానా రివీల్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ రిలీజ్ చేశారు. సినిమాలో కాస్టింగ్ ను రివీల్ చేస్తూ వచ్చిన థ్యాంక్ యు బ్రదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ముఖ్యంగా అనసూయ బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది. అనసూయ తో పాటుగా ఈ సినిమాలో అశ్విన్ విరాజ్ మేల్ లీడ్ గా చేస్తున్నారు. ఈ సినిమాను రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష