అల్లు అర్జున్ తో కొరటాల శివ 'రాజకీయం'

November 27, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో మూవీ ప్లాన్ చేశాడని తెలిసిందే. ఈ సినిమా 2021 చివర్లో మొదలుపెట్టి 2022 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి కొద్దిపాటి గ్యాప్ తో బన్నీ మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.

తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకునే కొరటాల శివ అల్లు అర్జున్ సినిమాలో కూడా అదే పంథా కొనసాగిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ ను రాజకీయ నేతగా చూపిస్తున్నాడట కొరటాల శివ. ఆల్రెడీ భరత్ అనే నేను సినిమాలో మహేష్ ను సిఎంగా చూపించాడు కొరటాల శివ మరోసారి బన్నీతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తున్నాడట. స్టూడెంట్ లీడర్ నుండి పవర్ ఫుల్ పొలిటీషియన్ గా అల్లు అర్జున్ మారుతాడని టాక్. చూస్తుంటే అల్లు అర్జున్ కోసం కొరటాల శివ భారీ స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష