3 సినిమాలు 1000 కోట్లు.. ప్రభాస్ రేంజ్ ఇది..!

November 27, 2020


img

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. అంతకుముందు వరకు కేవలం తెలుగు సినిమాలే చేసే ప్రబ్ణాస్ బాహుబలి తర్వాత మాత్రం చేస్తే పాన్ ఇండియా సినిమానే అంటున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యామ్ సినిమా కూడా నేషనల్ వైడ్ గా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కోసం 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. దీని తర్వాత చేస్తున్న ఆదిపురుష్ సినిమా 450 కోట్లతో వస్తుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఉంది. ఆ సినిమా ఎలా లేదన్నా 300 కోట్ల బడ్జెట్ తో వస్తుందట. సో ప్రభాస్ 3 సినిమాలతో 1000 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారు. ప్రభాస్ కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో ఉంచుకునే ఈ బడ్జెట్ పెడుతున్నారని చెప్పొచ్చు. సౌత్ హీరోల్లో స్టార్స్ అందరికన్నా ప్రభాస్ రేంజ్ వేరేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.Related Post

సినిమా స‌మీక్ష