పుష్ప కోసం తొమ్మిదిమంది విలన్స్..?

November 27, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో విలన్ గా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని ప్లాన్ చేశాడట సుకుమార్. 

పుష్ప సినిమాలో 9 మంది విలన్లు ఫిక్స్ చేశాడట సుక్కు. చిన్నా చితకా విలన్లతో కలిపి సినిమా మొత్తం బన్నీ తొమ్మిదిమందితో కొట్లాడుతాడని తెలుస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ కూడా పుష్పలో విలన్ గా నటిస్తున్నాడని టాక్. ఈమధ్యనే కలర్ ఫోటో సినిమాలో విలన్ గా మెప్పించిన సునీల్ కెరియర్ లో కొత్త టర్న్ తీసుకున్నాడని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష