ఎస్పి బాలుకి అరుదైన గౌరవం..!

November 27, 2020


img

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేష్ లోని నెల్లూరు మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్ కు డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరుని పెట్టాలని నిర్ణయించారు ఏపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపి ప్రభుత్వం తన తండ్రికి అందించిన ఈ గౌరవంపై స్పందించారు ఎస్పీ చరణ్. తన తండ్రికి గొప్ప గౌరవం దక్కిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సిఎం వైఎస్ జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి తన ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఎస్పీ చరణ్ తన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. 

నెల్లూరు లోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల పేరు ఇక నుండి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరుగా ఉంటుందని అందుకు సంబందించిన ఆర్డర్స్ జారీ చేసింది.  కరోనా మహమ్మారి వల్ల హాస్పిటల్ పాలైన బాలు కరోనా నెగటివ్ వచ్చినా సరే నెలరోజులకుపైగా చావుతో పోరాడి ఓడిపోయారు. బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలని కూడా ఏపి సిఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష