దుబాయ్ లో రంగ్ దే..!

November 26, 2020


img

ఈ ఇయర్ మొదట్లో భీష్మ హిట్ తో సూపర్ ఫాంలోకి వచ్చిన నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ దుబాయ్ లో జరుగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో షూటింగ్ దాదాపు పూర్తవుతుందని తెలుస్తుంది. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

2021 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా నుండి నితిన్ పెళ్లి కానుకగా వచ్చిన టీజర్ మెప్పించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు నితిన్. ఈ సినిమాతో పాటుగా నితిన్ చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చెక్ సినిమా కూడా చేస్తున్నాడు. Related Post

సినిమా స‌మీక్ష