మెగా ప్రిన్స్ పెంచేశాడా..!

November 26, 2020


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పెంచాడని లేటెస్ట్ టాక్. లాస్ట్ ఇయర్ ఎఫ్-2, గద్దలకొండ గణేష్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎఫ్-2 సీక్వల్ గా వస్తున్న ఎఫ్-3 సినిమా చేయాల్సి ఉంది. వెంకటేష్ కూడా ప్రస్తుతం చేస్తున్న నారప్ప సినిమా తర్వాత ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది.

అయితే ఎఫ్-3కి వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పెంచేసినట్టు టాక్. వరుస హిట్లు పడుతుంటే హీరోలు రెమ్యునరేషన్ పెంచడం కామనే. అయితే వరుణ్ తేజ్ పెంచిన రేటు దిల్ రాజుకి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మెగా ప్రిన్స్ స్క్రీన్ నేం తో వరుణ్ తేజ్ దుమ్ముదులిపేస్తున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు హీరోగా సక్సెస్ కాకపోయినా తనయుడు వరుణ్ తేజ్ మాత్రం సెలెక్టెడ్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. Related Post

సినిమా స‌మీక్ష