RRR కు ఆమీర్ ఖాన్..!

November 24, 2020


img

సినిమా తీయడం ఒక ఎత్తైతే ఆ సినిమాని ప్రమోట్ చేయడం కూడా ఒక ఎత్తు. వాటిలో దర్శకధీరుడు రాజమౌళి కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉంటాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను అంతకుమించి అనిపించేలా చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా R.R.R. 

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్, కొమరం భీం పాత్రలో తారక్ నటిస్తున్నారు. సినిమాలో పాత్రల పరిచయం టీజర్ ను రిలీజ్ చేసి అంచనాలు పెంచాడు జక్కన్న. ఇక బాలీవుడ్ లో ఈ పాత్రల పరిచయానికి ఆమీర్ ఖాన్ వాయిస్ డబ్బింగ్ చెబుతున్నారట. కోరం భీం, అల్లూరి సీతారామ రాజు రెండు పాత్రలకు ఆమీర్ ఖాన్ డబ్బింగ్ చెబుతాడని తెలుస్తుంది. మొత్తానికి బాలీవుడ్ లో కూడా ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు పెరిగేలా రాజమౌళి పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష