పవర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా..!

November 24, 2020


img

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న వకీల్ సాబ్ పూర్తి కాగానే క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కెరియర్ లో ఇంతవరకు ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్ స్టోరీతో క్రిష్ సినిమా వస్తుంది. పవన్ బర్త్ డే రోజు రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది.. ఈ సినిమా ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది అన్నది. క్రిష్ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో పవన్ సినిమా లైన్ లో ఉంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక్కరు కాదు ఇద్దరని తెలుస్తుంది. హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ ను డ్యుయల్ రోల్ లో చూపిస్తాడట. గబ్బర్ సింగ్ తో హిట్ కాంబోగా నిలిచిన ఈ ఇద్దరు చేస్తున్న రెండో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష