త్వరలో తెరుచుకొనున్న సినిమా హాల్స్

November 24, 2020


img

కరోనా కారణంగా సుమారు 8 నెలలుగా రాష్ట్రంలో మూతపడిన సినిమా హాల్స్ మళ్ళీ తెరుచుకోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నేటికీ కరోనా ముప్పు వెంటాడుతున్నందున కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతోనే సినిమా హాల్స్ నడిపించుకోవలసి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

మార్గదర్శకాలు: 

• కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న సినిమా హాల్స్, మల్టీ ప్లెక్స్ థియేటర్లు మాత్రమే తెరుచుకోవచ్చు.  

• సిబ్బంది, ప్రేక్షకులు అందరూ విధిగా మాస్కులు ధరించాలి. 

• ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద విధిగా శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలి.    

• సినిమా హాల్స్ ఆవరణలో, లోపల కూడా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలి. 

• ప్రతీ ఆట తరువాత సినిమా హాల్ మొత్తం శానిటైజ్ చేయాలి. 

• మల్టీ ప్లెక్స్ థియేటర్లలో వేర్వేరు సమయాలలో సినిమాలు ప్రారంభం, విరామం(ఇంటెర్వెల్),ముగిసేలా టైమింగ్స్ ఏర్పరచుకోవాలి. 

• సినిమా హాల్స్ లోపల 24 నుంచి 30 డిగ్రీలు మద్య ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలను నిర్వహించాలి. లోపల తగినంత గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. 


Related Post

సినిమా స‌మీక్ష