మహేష్ కాల్ కోసం వెయిటింగ్..!

November 23, 2020


img

సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబోలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా తర్వాత మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి నుండి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది.

సరిలేరు నీకెవ్వరు తర్వాత అనీల్ రావిపుడి కూడా ఎఫ్-3 సినిమాకు రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపుడి బర్త్ డే సందబ్ర్హంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వ్యాక్సిన వచ్చినా రాకున్నా ఎఫ్-3తో నవ్వుల వ్యాక్సిన మాత్రం కచ్చితంగా వస్తుందని అంటున్నాడు అనీల్ రావిపుడి. ఇక మహేష్ తో మరో సినిమా ఎప్పుడని అడిగితే మహేష్ సర్ కాల్ చేస్తే వెంటనే ఆయన ముందు వాలిపోతా అంటున్నాడు. సరిలేరు నీకెవ్వరు టైం లోనే మహేష్ కోసం రాసిన కథని వినిపించాడట అనీల్ రావిపుడి. త్వరలోనే మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుందని చెప్పొచ్చు.




Related Post

సినిమా స‌మీక్ష