కెటీఆర్ ను కలిసిన సుమ..!

November 22, 2020


img

ఎప్పుడూ సినిమా ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్ షోలు అంటూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేసే తెలుగు టివి టాప్ యాంకర్ సుమ కనకాల అందరికి సర్ ప్రైజ్ ఇస్తూ తెలంగాణా రాష్ట మంత్రి కె.తారక రామారావును కలవడం విశేషం. హైదరాబాద్ అభివృద్ధి కోసం కె.టి.ఆర్ చేస్తున్న కృషి అద్భుతమని అన్నారు సుమ. ఆయనతో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కె.టి.ఆర్ సర్ తో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.   

ఓ హైదరబాదీగా మన నగరం అభివృద్ధి వంటి చర్యల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. అయితే కె.టి.ఆర్ ను కలిసిన తర్వాత మీకు మీ టీం కు కుడోస్ అంటూ సుమ కె.టి.ఆర్ తో దిగిన పిక్ షేర్ చేశారు. షోలో ఆపకుండా మాట్లాడుతా కాని మీ నాయకత్వం నన్ను శ్రద్ధగా వినేలా చేసిందని సుమ ట్వీట్ చేశారు. Related Post

సినిమా స‌మీక్ష