ఉప్పెన డైరక్టర్ అడ్వాన్స్ తిరిగిచ్చేశాడట..!

November 22, 2020


img

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరనేట్రం చేస్తున్న సినిమా ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రచారం చిత్రాలు చూసి పక్కా హిట్టు బొమ్మ అని ఫిక్స్ అయ్యారు. సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించడం కూడా ప్లస్ పాయింట్ అని తెలుస్తుంది.

అయితే మొదటి ప్రాజెక్ట్ ఉప్పెన రిలీజ్ కు ముందే హిట్ అనేస్తున్నారు. అందుకే బుచ్చిబాబుకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. బుచ్చి బాబు సెకండ్ మూవీ కోసం సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి ఆఫర్ వచ్చిందట. 70 లక్షల అడ్వాన్స్ ఎమౌంట్ కూడా వచ్చిందని టాక్. అయితే ఆ అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయాలని అనుకున్న బుచ్చి బాబుకి ఉప్పెన నిర్మాతలు మరో ఆఫర్ ఇచ్చారట. మొదటి సినిమా నిర్మాతలు కాబట్టి ఆ ఆఫర్ ను కాదనలేకపోయాడట బుచ్చి బాబు. అందుకే సితార వారు ఇచ్చిన అడ్వాన్స్ ఎమౌంట్ తిరిగి ఇచ్చేశాడని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అతనితో మూడవ సినిమాకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష