నాని సినిమా సూపర్ ఎనౌన్స్ మెంట్..!

November 21, 2020


img

నాచురల్ స్టార్ నాని సినిమాల ప్లాన్ అదిరింది.. ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్న నాని ఆ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యామ్ సింగ రాయ్ సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమాను నాని ఇదివరకు సినిమాల కన్నా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఇదిలాఉంటే టాలెంటెడ్ డైరక్టర్ వివేక్ ఆత్రేయతో నాని సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈమధ్యనే సినిమా ఎనౌన్స్ మెంట్ చేసిన నాని లేటెస్ట్ గా సినిమా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 

కొద్దిరోజులుగా చర్చల్లో ఉన్న అంటే సుందరానికీ టైటిల్ తోనే ఈ సినిమా వస్తుంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో సత్తా చాటిన వివేజ్ ఆత్రేయ నానితో క్రేజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన పోస్టర్ చూస్తే సినిమా పక్కా ఎంటర్టైన్ చేస్తుందని అనిపిస్తుంది. అందుకు తగినట్టుగానే నాని ట్విట్టర్ లో పెట్టిన కామెంట్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.

Related Post

సినిమా స‌మీక్ష