రియల్ హీరోని సత్కరించిన ఆచార్య టీం..!

November 21, 2020


img

కరోనా లాక్ డౌన్ టైంలో స్టార్స్ కూడా చేయని సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. తెలుగు సినిమాల్లో విలన్ గా నటించే సోనూ సూద్ లాక్ డౌన్ టైం లో వందలాది మందికి సాయం చేసి హీరోగా మారాడు.. తనని సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా హెల్ప్ చేస్తూ వచ్చారు సోనూ సూద్. ఈమధ్యనే అల్లుడు అదుర్స్ సెట్స్ కు హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్ అక్కడ ఘన స్వాగత సత్కారాలు అందుకున్నాడు.  


మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా సోనూ సూద్ నటిస్తున్నాడు. లేటెస్ట్ గా ఆచార్య షూటింగ్ లో పాల్గొన్న సోనూ సూద్ ను డైరక్టర్ కొరటాల శివ, నటుడు రచయిత తనికెళ్ల భరణి సత్కరించారు. సోనూ సూద్ కు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. కరోనా టైంలో ఎంతోమందికి సహాయం చేసిన సోనూ సూద్ ఎంతో స్పూర్తిని ఇచ్చారని తనికెళ్ల భరణి మెచ్చుకున్నారు. తనకు దక్షిణాది సినిమాల్లో నటించేప్పుడు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని.. ఇక్కడ ప్రేక్షకులు అందిచే ప్రేమని మాటల్లో చెప్పలేనని అన్నారు సోనూ సూద్.  Related Post

సినిమా స‌మీక్ష