అఖిల్ సినిమాలో కన్నడ భామ..!

November 20, 2020


img

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ సినిమా ఉంటుందని తెలిసిందే. ఈమధ్యనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. మాస్ డైరక్టర్ గా సురేందర్ రెడ్డి సైరా తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేయాలని అనుకున్నా అది వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని సెలెక్ట్ చేశారట చిత్రయూనిట్. కన్నడ భామ రష్మికకు తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె సూపర్ ఫాం లో ఉంది. ఈ ఇయర్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్ పుష్పతో పాటుగా అఖిల్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష