రొమాంటిక్ బ్యూటీకి అదిరిపోయే ఛాన్స్..!

November 20, 2020


img

పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాను పూరీ, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా కెతిక శర్మ నటిస్తుంది. డబ్ స్మాష్ బ్యూటీగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కెతిక శర్మ తన మొదటి సినిమా రిలీజ్ కు ముందే వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. రొమాంటిక్ రిలీజ్ అవకుండానే నాగ శౌర్య 20వ సినిమా పార్ధులో ఛాన్స్ దక్కించుకుంది కెతిక శర్మ.

ఇక లేటెస్ట్ గా త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమాలో హీరోయిన్ గా కూడా ఆమెకు ఛాన్స్ వచ్చినట్టు టాక్. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. మరోసారి ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష