పవన్ కళ్యాణ్ కు జోడీగా మమతా..?

November 20, 2020


img

మళయాళ భామ మమతా మోహన్ దాస్ ఇప్పటికి అక్కడ మంచి ఫాం కొనసాగిస్తున్నారు. క్యాన్సర్ తో పోరాడి జయించిన ఆమె కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా రీ ఎంట్రీ తర్వాత మళయాళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక తెలుగు ఆడియెన్స్ కు సింగర్ గా.. హీరోయిన్ గా పరిచయం ఉన్న మమతా మోహన్ దాస్ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుందని టాక్.

మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం రీమేక్ లో పవర్ స్టార్ నటిస్తారని తెలిసిందే. ఈ సినిమాలో పవన్ తో మమతా మోహన్ దాస్ జోడీ కడుతుందని తెలుస్తుంది. మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే మరో స్టార్ హీరో ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. సుదీప్, రానా, నితిన్ లేటెస్ట్ గా గోపీచంద్ కూడా డిస్కషన్స్ లో ఉన్నాడని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష