యాక్షన్ కింగ్ డైరక్షన్ లో నాగ చైతన్య..!

October 30, 2020


img

కన్నడ హీరో అర్జున్ సర్జా కన్నడలోనే కాదు తమిళ, తెలుగు భాషల్లో కూడా మంచి సినిమాలు చేశాడు. హీరోగా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అర్జున్ తన సత్తా చాటారు. ఇక లేటేస్ట్ గా మరోసారి ఆయన మెగా ఫోన్ పట్టుకోనున్నాడని తెలుస్తుంది. తమిళంలో ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన అర్జున్ తెలుగులో అక్కినేని హీరోని డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.

అర్జున్ సర్జా రీసెంట్ గా నాగ చైతన్యకు ఓ కథ చెప్పాడట. చైతుకి కథ నచ్చిందని టాక్. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. అర్జున్ హీరోగా యాక్షన్ సినిమాలే చేశారు డైరక్టర్ గా కూడా అలాంటి సినిమాలకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. నాగ చైతన్యతో కూడా అర్జున్ ఓ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో హీరోగా సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించిన అర్జున్ సర్జా నాగ చైతన్యతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష