పున్నూ బేబి వెబ్ సీరీస్ కు ఇంత అవసరమా..?

October 30, 2020


img

బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ లో ఒకరైన పునర్నవి ఉయ్యాల జంపాల సినిమాలో సైడ్ రోల్స్ చేసింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3తో బాగా పాపులర్ అయ్యింది. రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె చేసిన లవ్ డ్రామా ఓ విధంగా అతనికి టైటిల్ విన్నర్ అయ్యేందుకు సహకరించిందని చెప్పొచ్చు. ఇదిలాఉంటే పునర్నవి రెండు రోజుల క్రితం ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెన్ అని కామెంట్ పెట్టింది.

అందరు పునర్నవి పెళ్లి ఫిక్స్ చేసుకుని ఎంగేజ్మెంట్ జరుపుకుందని అనుకున్నారు కాని ఆమె ఇదంతా ఓ వెబ్ సీరీస్ కోసం పబ్లిసిటీ స్టంట్ అని ఊహించలేదు. పునర్నవి భూపాలం, ఉద్భవ్ రఘునందన్ ఇద్దరు కలిసి నటిస్తున్న వెబ్ సీరీస్ కమిట్ మెంటల్. ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే పునర్నవి ఎంగేజ్మెంట్ రింగ్ తో దర్శనమిచ్చింది. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కమిట్ మెంటల్ వెబ్ సీరీస్ నవంబర్ 13 నుండి అహాలో అందుబాటులో ఉంటుంది. తెలుగు ఓటిటి గా ఆహా సరికొత్త వెబ్ సీరీస్ లతో దూసుకెళ్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష