ఇటలీలో ప్రభాస్ మేనియా అలా ఉంది..!

October 30, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇంటర్నేషనల్ లెవల్ లో ఫాలోయింగ్ పెరిగింది. ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా వివిధ దేశాల్లో రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించింది. అందుకే ప్రభాస్ ను అందరు గుర్తుపడుతున్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్ కోసం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్నారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్లు వేశారు. ప్రభాస్ రాధే శ్యామ్ ఇటలీలో షూటింగ్ జరుపుకోవడం ఇటాలియన్లను ఆకర్షిస్తుంది.  

అక్కడ మీడియా సంస్థలు ప్రభాస్ రాధే శ్యామ్ గురించి స్పెషల్ కవరేజ్ చేస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ గురించి.. రాధే శ్యామ్ సినిమా కాన్సెప్ట్ గురించి.. సినిమా ప్రత్యేకత గురించి స్పెషల్ గా అక్కడ మీడియా కవర్ చేస్తుందట. అక్కడ ఓ ఛానెల్ కోసం ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ టైం లో ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమాగా ప్రభాస్ రాధే శ్యామ్ రికార్డ్ సృష్టించింది. మొత్తానికి అలా ప్రభాస్ క్రేజ్ ఇటలీ మొత్తం మారుమోగుతుంది.   



Related Post

సినిమా స‌మీక్ష